శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 12 అక్టోబరు 2023 (11:39 IST)

మొరాదాబాద్‌లో షాకింగ్ ఘటన.. నర్సు స్నానం చేస్తుంటే వీడియో తీసిన పోలీసు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ నర్సు స్నానం చేస్తుండగా, కానిస్టేబుల్ ఒకడు వీడియో తీశాడు. తాను స్నానం చేస్తుంటే ఓ పోలీస్ కానిస్టేల్ తనను రహస్యంగా ఫోనుతో రికార్డింగ్ చేశారంటూ ఆ నర్సు ఆరోపించింది. ఈ ఘటన  నల 10వ తేదీన జరిగిందన్నారు. బాధితురాలు మొరాదాబాద్‌లోని జిల్లా ఆస్పత్రిలో నర్సుగా చేస్తుది. 
 
నిందితుడు తన పొరుగింట్లో ఉంటాడని, అతడు తన సహోద్యోగి భర్తే అని ఆమె చెప్పింది. ఆ రోజు ఉదయం స్నానం చేసి దుస్తులు ధరిస్తూ తెరపైకి చూడగా ఓ కెమెరా కనిపించిందని చెప్పింది. వెంటనే తాను బాత్రూమ్ బయటకు వచ్చి చూడగా పొరుగింటి లోపలి నుంచ గొళ్లెం పెట్టి ఉందని చెప్పింది. 
 
అక్కడే ఉన్న ఓ మహిళను తలపులు తెరవమని చెప్పి లోపలికి వెళ్ళి చూడగా నిందితుడు కనిపించాడని పేర్కొంది. తాను అతడిని సెల్‌ఫోన్ చూపించమని కోరగా నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడని చెప్పింది. ఆ వెంటనే ఆమె సివిల్ పోలీస్ లైన్స్‌లో ఫిర్యాదు చేసినట్టు చెప్పింది.