Exit polls, జూబ్లిహిల్స్‌లో కాంగ్రెస్, బీహారులో ఎన్డీయే
ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. సర్వే సంస్థలన్నీ దాదాపు అధికార కాంగ్రెస్ పార్టీయే జూబ్లిహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని తేల్చాయి. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 46 శాతం ఓట్లు, బీఆర్ఎస్ 43 శాతం, బీజేపి 6 శాతం ఓట్లు పోలైనట్లు తెలిపింది. పీపుల్స్ పల్స్ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 48 శాతం, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపికి 6 శాతం ఓట్లు పోలైనట్లు తెలిపింది. ఐతే ఓటర్ల తీర్పు ఎలా వుందన్నది తెలియాలంటే నవంబర్ 14 వరకూ వేచి చూడాల్సి వుంది.
ఇక బీహార్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకి అధికారం దక్కుతుందని సర్వేలు చెబుతున్నాయి. పీపుల్స్ పల్స్ ఎన్డీయేకి 133-159 మధ్య సీట్లు వస్తాయని చెబుతోంది. ఎంజీబికి 75-101 మధ్య రావచ్చని అంచనా వేసింది. అలాగే దైనిక్ భాస్కర్ ఎన్డీయేకి 145 నుంచి 160 మధ్యన వస్తాయనీ, ఎంజిబికి 73 నుంచి 91 మధ్య రావచ్చని అంచనా వేసింది.