శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2024 (20:45 IST)

పిండిలో మూత్రం కలిపి చపాతీలు తయారీ... ఎక్కడ?

chapati
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ పారిశ్రామికవేత్త ఇంటిలో పని చేసే పనిమనిషి (వంట మనిషి) పిండిలో మూత్రం కలిపి చపాతీలు చేస్తోంది. ఈ తంతు గత ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్నప్పటికీ ఆ పారిశ్రామికవేత్త కుటుంబ సభ్యుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా గుర్తించలేకపోవడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన 32 యేళ్ళ రీనా అనే ఓ మహిళ స్థానిక రెసిడెన్షియల్ సొసైటీలో నివసించే ఓ పారిశ్రామికవేత్త నితిన్ గుప్తా ఇంటిలో గత ఎనిమిదేళ్ల నుంచి వంట మనిషిగా పని చేస్తుంది. చపాతీల కోసం తయారు చేసే పిండిలో నీళ్లకు బదులు మూత్రం కలిపి పిండిని తయారు చేసి, ఆ పిండితో చపాతీలు చేసి వడ్డిస్తూ వచ్చింది. ఈ తంతు గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతూ వచ్చింది. 
 
ఈ క్రమంలో ఆ వ్యాపారవేత్త కుటుంబ సభ్యులందరూ ఒకేలా కాలేయ సమస్యలతో అనారోగ్యంపాలవుతూ వచ్చారు. దీంతో నితిన్ గుప్తా భార్య రూమ్ గుప్తాకు వంట మనిషిపై అనుమానం వచ్చింది. దీంతో ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వంట గదిలో రహస్యంగా సీసీకెమెరా అమర్చారు.
 
ఆ తర్వాత ఫుటేజీని పరిశీలించగా వారి కళ్లు బైర్లు కమ్మాయి. ఆ సీసీటీవీ ఫుటేజీలను చూసిన ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. రోటీలు తయారు చేసేందుకు పిండిలో మూత్రం కలపడం చూసి షాకయ్యారు. దీంతో ఈ వీడియోను తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
తొలుత ఈ ఆరోపణలను నిందితురాలు రీనా ఖండించింది. వీడియో చూపించాక నేరాన్ని అంగీకరించింది. అరెస్టు చేసిన అనంతరం ఆమెను ప్రశ్నించగా షాకింగ్ విషయాలు వెల్లడించింది. చిన్నచిన్న విషయాలకు కూడా తనను తిడుతుండడంతో ప్రతీకారం తీర్చుకునేందుకే తానీపని చేసినట్టు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు.