శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 23 సెప్టెంబరు 2024 (22:09 IST)

ఆరేళ్ల బాలికపై దుండగుడు అత్యాచార యత్నం: కాపాడిన వానర దండు

Monkey
పశు వాంఛతో పసిబాలికపై అత్యాచారానికి పాల్పడబోయిన ఓ దుండగుడి భరతం పట్టాయి వానరాలు. గోళ్లతో రక్కి, పళ్లతో గాయాలు చేసి ఆ కామాంధుడి నుంచి చిన్నారిని రక్షించాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బాఘ్‌పట్ ప్రాంతంలో చోటుచేసుకున్నది.
 
ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను మాయమాటలు చెప్పి సమీపంలో వున్న పాడుబడ్డ ఇంట్లోకి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిపై అతడు లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఐతే అక్కడే వున్న కోతుల గుంపు అతడి పైన దాడికి దిగాయి. ఈ హఠాత్పరిణామంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. సీసీటీవి ఫుటేజిని పరిశీలించిన పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.