శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 30 జులై 2024 (15:03 IST)

పాపం అమితాబ్ బచ్చన్ ఎలా భరిస్తున్నారో?: జయా బచ్చన్ పైన ట్రోల్స్

Jaya Bachchan
రాజ్యసభ సభ్యురాలు, సీనియర్ నటి, అమితాబ్ బచ్చన్ శ్రీమతి జయా బచ్చన్ చాలా సాధారణంగా వుంటుంటారు. దాదాపు వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా వుంటారు. అలాంటిది సోమవారం నాడు ఆమె మాట్లాడిన తీరును చూసి పలువురు విస్మయం వ్యక్తం చేసారు.
 
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే... ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా రావూస్ కోచింగ్ సెంటర్లో సివిల్స్ ఆశావహులు ముగ్గురు వరద నీటిలో చిక్కుకుని మరణించిన అంశంపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ చైర్మన్ స్థానంలో వున్న హరివంశ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ... శ్రీమతి జయా అమితాబ్ బచ్చన్ జీ మీరు మాట్లాడంటూ అంటూ పిలిచారు. వెంటనే తన స్థానంలో నుంచి లేచి తనను జయా బచ్చన్ అని పిలవండి చాలు అంటూ ఆమె డిప్యూటీ చైర్మన్‌కి విజ్ఞప్తి చేసారు.
 
దీనితో హరివంశ నారాయణ్ సింగ్ సమాధానమిస్తూ... పార్లమెంటు రికార్డుల్లో వున్నవిధంగానే మీ పేరును పిలిచానంటూ చెప్పారు. అందుకు జయా బచ్చన్ మాట్లాడుతూ... తనకిది చాలా కొత్తగా వుందనీ, భర్త పేరుతోనే మహిళకు గుర్తింపు వస్తుందా, మహిళలకు స్వంతంగా వునికి లేదా అంటూ సందేహాలు వ్యక్తం చేసారు. ఆ తర్వాత కొద్దిసేపటికి సర్దుకుని ఢిల్లీలో ముగ్గురు విద్యార్థుల మృతి బాధాకరమని అన్నారు.
ఇదిలావుంటే జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. పాపం ఇన్నాళ్లుగా ఈమెను అమితాబ్ బచ్చన్ ఎలా భరిస్తున్నారో అంటూ కామెంట్లు పెడుతున్నారు.