శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 మార్చి 2024 (21:59 IST)

దీదీ మమతా బెనర్జీ నుదుటిపై లోతైన గాయం, కారుతున్న రక్తం

Mamta Banerjee
Mamta Banerjee
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా తృణమూల్ పార్టీ ధ్రువీకరించింది. "మా ఛైర్‌పర్సన్ మమతా బెనర్జీ తీవ్రంగా గాయపడ్డారని టీఎంసీ రాసింది. వారి కొరకు ప్రార్థించండి." అంటూ పేర్కొంది. 
 
ఇది కాకుండా, సీఎం మమత గాయపడిన ఫోటోను కూడా షేర్ చేసింది. అందులో ఆమె నుదిటి నుండి రక్తస్రావం  కనిపిస్తుంది. ఆమెను కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆమెకు చికిత్స కొనసాగుతోంది. 
Mamta Banerjee
Mamta Banerjee
 
మమతా బెనర్జీ గాయపడడానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. టీఎంసీ కూడా తన ట్వీట్‌లో ఈ సమాచారాన్ని అందించలేదు. మమతకు ఇంట్లో గాయాలయ్యాయి. మమత గాయాల గురించి తెలుసుకున్న ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇంటికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు.