శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 24 నవంబరు 2024 (15:51 IST)

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌.. రిపేర్ చేసినందుకు రూ.90వేలు బిల్లు.. అంతే విరగ్గొట్టేశాడు..! (video)

EV
EV
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన షాకింగ్ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, ఒక వ్యక్తి రోడ్డు మధ్యలో తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొట్టడం కనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే.. వినియోగదారుడు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక నెల క్రితం కొనుగోలు చేశాడు. వెంటనే ఆ స్కూటర్‌లో లోపాలు తలెత్తాయి. 
 
ఈ లోపాలను సరిచేసిన పాపానికి 90వేల రూపాయల బిల్లు వచ్చింది. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన సదరు స్కూటర్ యజమాని.. ఆ స్కూటర్‌ను విరిచిపడేశాడు. కోపంతో స్కూటర్‌ భాగాలను విడివిడి చేసేశాడు. "షోరూమ్ రూ. 90,000 బిల్లు చేసింది. దీంతో కస్టమర్ షాకయ్యాడు. షోరూమ్ ముందు స్కూటర్‌ను పగలగొట్టాడు" అని వీడియో క్యాప్షన్‌లో వుంది. 
 
ఈ వీడియోలో ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్ ముందు ఉన్న స్కూటర్‌పై తెల్లటి టీ షర్టు ధరించిన వ్యక్తి దాడి చేయడం వీడియోలో చూడవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో సాఫ్ట్‌వేర్ నుండి హార్డ్‌వేర్ వరకు వినియోగదారులు నిరంతరం సమస్యలను ఎదుర్కొంటున్నారు.