శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 మార్చి 2024 (19:28 IST)

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు బ్లాక్.. రైలు టిక్కెట్లకు కూడా డబ్బు లేదు.. రాహుల్

Rahul Gandhi
కాంగ్రెస్‌కు చెందిన బ్యాంకు ఖాతాలు స్తంభించిపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ గత కొన్ని వారాలుగా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ అంశంపై సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలోని పార్టీ అగ్రనాయకులు మీడియాతో మాట్లాడుతూ తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంపై కేంద్ర అధికారులపై మండిపడ్డారు.
 
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను కేంద్ర అధికారులు ఎంచక్కా టార్గెట్‌ చేస్తున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ‘స్తంభింపచేసిన ఖాతాల కారణంగా మా పార్టీ ఎన్నికల ప్రచారానికి కూడా నిధులు సమకూర్చలేకపోతున్నాం. విమాన టిక్కెట్లు పక్కన పెడితే, మా ఎన్నికల ప్రచారానికి మా నాయకులకు రైలు టిక్కెట్లు కూడా కొనలేకపోతున్నాం.. అంటూ రాహుల్ గాంధీ చెప్పారు. 
 
తమ లోక్‌సభ ప్రచారానికి అయ్యే ప్రకటనల ఖర్చును కూడా కాంగ్రెస్ పార్టీ భరించే స్థితిలో లేదని   ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ప్రధాన బ్యాంకు ఖాతాలను ఈ మేరకు స్తంభింపజేయడం గతంలో ఎన్నడూ జరగలేదని, రాజ్యాంగ, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడంపై కాంగ్రెస్‌ ఎన్‌డీఏ ప్రభుత్వంపై మండిపడుతోంది.