శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఆగస్టు 2023 (16:27 IST)

కస్టమర్లకు స్వయంగా ఫుడ్ డెలివరీ చేసిన జొమాటో సీఈవో

zomato ceo deepinde goel
అనుకున్న సమయానికి ఫుడ్ డెలివరీ చేసే ఈ-కామర్స్ కంపెనీల్లో జొమాటోకు మంచి పేరుంది. ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ కంపెనీ సీఈవో పలువురు కష్టమర్లకు, రెస్టారెంట్ భాగస్వాములు, డెలివరీ భాగస్వాములు, కస్టమర్లకు స్వయంగా ఫుడ్ డెలివరీ చేశారు. ఈ సందర్భంగా వారికి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లను చేతికి కట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 
 
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుపై జొమాటో టీ షర్టు ధరించి, తలకు హెల్మెట్ పెట్టుకుని ఉన్న ఫోటోలను ఆయన షేర్ చేశారు. జొమటో బ్రాండింగ్, ఫ్రెండ్‌షిప్ కొటేషన్లతో కూడిన హ్యాండ్ బ్యాండ్‌లను ఆయన పంపిణీ చేసిన వాటిలో ఉన్నాయి. కాగా, అపుడపుడూ జొమాటో సీనియర్ ఉద్యోగులు కూడా స్వయంగా ఆర్డర్లు డెలివరీ పని చేస్తుంటారు. తద్వారా డెలివరీ భాగస్వాములు, కస్టమర్ల అవసరాలు, ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. తద్వారా తమ సేవలను ఎప్పటికపుడు మెరుగుపరుచుకుంటూ ముందుకుసాగుతున్నారు.