శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (12:21 IST)

ఆ రోజున భారత్‌లో రిజర్వేషన్లు రద్దు చేస్తాం : రాహుల్

Rahul Gandhi
భారత పౌరులందరికీ పారదర్శకమైన పరిస్థితిలు నెలకొని, సమాన అవకాశాలు వచ్చిన రోజున దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహులా గాంధీ అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వరుస సమావేశాల్లో పాల్గొంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రిజర్వేషన్ల అంశంపై స్పందించారు. భారత్‌లోని అన్ని వర్గాల ప్రజలకు సమానమైన, పారదర్శక అవకాశాలు లభించే పరిస్థితులు వచ్చిన తర్వాత రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచన చేస్తుందని తెలిపారు. 
 
ప్రస్తుతం భారత్‌లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని రాహుల్ అన్నారు. అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కూడా అంతంతమాత్రంగా ఉందని పేర్కొన్నారు. కామన్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌర స్మృతి)పై ప్రశ్నించగా, దానిపై తాను ఇపుడే స్పందించలేదనని స్పష్టం చేశారు. అమెరికాలో ప్రతిష్టాత్మక జార్జ్ టౌన్ యూనివర్శిటీలో విద్యార్థులను ఉద్దేశించి జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.