Lord Vitthal snake: పాము దర్శనంలో విట్టల్ దర్శనం.. వీడియో వైరల్
Lord Vitthal snake sighting
మహారాష్ట్రలోని అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన పంఢర్‌పూర్ భీమ నది ఒడ్డున ఉంది. దీని అర్ధచంద్రాకారం వంకరగా ఉండటం వల్ల దీనిని చంద్రభాగ అని కూడా పిలుస్తారు. పాండురంగ, పంఢరీనాథ్ అని కూడా పిలువబడే విఠల్ లేదా విఠోబా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.
అయితే కలియుగంలో విట్టల్ దర్శనం పాము రూపంలో కలిగింది. తాజాగా కొలనులో నాగుపాము కనిపించింది. ఆ పాము తల విఠల పండరీనాథుడిలా వుంది. ఆ పాము తల విఠల్ ముఖాన్ని పోలివుంది.
ఈ దర్శనం భక్తులను నెట్టింట కనువిందు చేస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. దేవతా ముఖం కలిగిన అంటే విఠల్ ప్రభువు ముఖం పాములో చూడటం శుభసూచకమని భక్తులు విశ్వసిస్తున్నారు.