శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2024 (16:31 IST)

ప్రతివాదుల వాదనలు వినకుండా బెయిల్ ఇవ్వలేం : కవితకు సుప్రీం షాక్

kavitha
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు మరోమారు చుక్కెదురైంది. ఆమెకు ఇప్పటికిపుడు బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ, సీబీఐ, ఈడీకి ధర్మాసనం నోటీసులు జారీచేసింది. 
 
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన కవితను సీబీఐ అరెస్టు చేయగా, ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉంటున్నారు. అయితే, ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. సీబీఐ, ఈడీకి నోటీసులు జారీచేసింది. 
 
ఈ పిటిషన్‌‍పై వెంటనే విచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టును కోరారు. అయితే, ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని పేర్కొన్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు.