శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 6 నవంబరు 2024 (19:49 IST)

ఆర్టీసి బస్సు నడుపుతూనే గుండెపోటుతో ప్రాణాలు వదిలిన డ్రైవర్, ఏమైంది? (Video)

Driver
ఆర్టీసి బస్సు నడుపుతూనే ఓ డ్రైవర్ గుండెపోటుకి గురై పక్కకి ఒరిగిపోయి ప్రాణాలు వదిలాడు. ఆ సమయంలో బస్సు వేగంగా వెళుతోంది. డ్రైవర్ అలా ఒరిగిపోవడంతో వేగంగా వెళుతున్న బస్సు కాస్త అదుపు తప్పి రోడ్డుకి పక్కగా ఆపి వున్న మరో బస్సు వెనుక భాగాన్ని ఢీకొని ముందుకు వేగంగా వెళ్తోంది. డ్రైవర్ అలా పడిపోవడంతో కండక్టర్ కేకలు వేస్తూనే డ్రైవర్ సీటులోకి దూకేసి బస్సును అదుపు చేసాడు.
 
దీనితో ప్రయాణికులందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కర్నాటక లోని బెంగళూరు నేలమంగళలో జరిగింది. బస్సు నేల మంగళ నుంచి దసనాపుర వెళ్తుండగా బస్సు నడుపుతున్న డ్రైవర్ గుండె పోటుతో డ్రైవింగ్ సీటులోనే ప్రాణాలు కోల్పోయాడు.