Lunar eclipse: 2025లో సంపూర్ణ చంద్రగ్రహణం- 2018 జూలై 27 తర్వాత భారత్‌లో కనిపించే?
2025లో మూడవ గ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం, సెప్టెంబర్ 7-8 తేదీలలో సంభవిస్తుంది. 2025లో నాలుగు గ్రహణాలు ఏర్పడతాయని, రెండు చంద్ర గ్రహణాలు మార్చి 14, సెప్టెంబర్ 7, రెండు సూర్య గ్రహణాలు (మార్చి 29, సెప్టెంబర్ 21) ఉంటాయని తెలిపింది. అయితే, భారతదేశంలో ఒకే ఒక గ్రహణం కనిపిస్తుంది.
సెప్టెంబర్ 7- 8 తేదీల్లో జరిగే గ్రహణం భారతదేశంలో కనిపించే సంపూర్ణ చంద్రగ్రహణం. సెప్టెంబర్ 7న రాత్రి 8.57 గంటల నుండి సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 2.26 గంటల వరకు ఉంటాయి. రాత్రి 9.57 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1.27 గంటలకు ముగుస్తుంది.
భూమి నీడ దానిని చుట్టుముట్టడంతో భారతదేశం అంతటా ప్రజలు చంద్రుడిని చీకటిగా మారడాన్ని చూడగలిగే కాలం ఇది. రాత్రి 9.57 గంటలకు చంద్రుడు భూమి ముదురు నీడలోకి ప్రవేశించడం ప్రారంభించి తెల్లవారుజామున 1.27 గంటలకు వరకు వుంటుందని ఇండియా ప్లానెటరీ సొసైటీ డైరెక్టర్ ఎన్ శ్రీ రఘునందన్ కుమార్ తెలిపారు.
సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 11.00 గంటల నుండి తెల్లవారుజామున 12.23 గంటల వరకు ఉంటుంది. ఈ కాలంలో, చంద్రుడు ఎరుపు లేదా నారింజ రంగుతో చీకటిగా కనిపిస్తుంది. టెలిస్కోపులు లేకుండా చంద్రగ్రహణాన్ని కంటితో చూడవచ్చు. దీనిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు.
2018 జూలై 27 తర్వాత భారత్‌లోని అన్ని ప్రాంతాల నుంచి సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించడం ఇదే మొదటిసారి కానుందని పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న దివ్యా ఒబెరాయ్ చెప్పారు. మళ్లీ ఇలాంటిది చూడాలంటే 2028 డిసెంబరు 31 వరకూ వేచి చూడాలన్నారు.