మంగళవారం, 25 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 7 అక్టోబరు 2025 (22:41 IST)

తొక్కిసలాటపై విజయ్, అజిత్, ధనుష్ బాధపడుతున్నారు: నటి అంబిక

Actress Ambika
ఇటీవల నటుడు విజయ్ పర్యటనలో కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కోలీవుడ్ సీనియర్ నటి అంబిక బాధితులను పరామర్శించేందుకు మంగళవారం నాడు వారి ఇళ్లకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తొక్కిసలాటపై విజయ్, అజిత్, ధనుష్ బాధపడుతున్నారు. ఇంకా ఎంతోమంది నటీనటులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఈ ఘటన ఎంతో దురదృష్టకరమైనది. ప్రాణాల విలువ వెలకట్టలేనిది.
 
నేను ఏ రాజకీయ పార్టీతోనూ కలిసి పనిచేయడం లేదు. ప్రత్యేకించి ఏ పార్టీతోనూ నాకు అనుబంధం లేదు. అందుకోసం ఇక్కడికి నేను రాలేదు. ఈ సంఘటనతో మానసికంగా నేను కూడా ఎంతో బాధపడ్డాను. కుటుంబ సభ్యులను కోల్పోయినవారిని ఓదార్చేందుకు నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి దీనికి ఎటువంటి రాజకీయ కారణం లేదు. ఈ సంఘటనలో బాధితులు నా మనవరాళ్ళు కావచ్చు. వారు నా పిల్లలు కావచ్చు. మరణించిన వారు నా సోదరుడు, తమ్ముడు, సోదరి, అత్త లేదా నా బంధువులు ఎవరైనా కావచ్చు అని అన్నారు.
 
గత నెల సెప్టెంబరులో విజయ్ ప్రచారం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఈ సంఘటన భారతదేశం అంతటా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కోర్టు జోక్యం చేసుకుని దర్యాప్తు జరపాలని సిట్‌ను ఆదేశించింది.