శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2024 (11:34 IST)

చైన్ స్నాచ్ ఘటన.. మహిళను రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెళ్లారు

chain snatching
chain snatching
తమిళనాడులోని మధురైలో ఘోరం జరిగింది. చైన్ స్నాచ్ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. చైన్ కోసం ఓ మహిళను దుండగులు ఈడ్చుకెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోలో భార్యాభర్తలిద్దరూ ఎక్కడికో వెళ్లి.. ఇంటి ముందు టూవీలర్‌ను ఆపారు. అంతే ఎక్కడి నుంచో బైకుపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని లైన్ లాగారు. అయితే అది చేతికి రాకపోవడంతో ఆ మహిళను కూడా ఈడ్చుకెళ్లారు. 
 
చైన్ స్నాచింగ్ చేసే క్రమంలో మహిళను రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెళ్లడాన్ని చూసిన భర్త.. పరుగులు తీశాడు. ఈ క్రమంలో అతనికి కూడా గాయాలైనాయి. చివరికి, గొలుసు తెగిపోయింది, ఒక భాగం నిందితుల చేతుల్లోకి మరియు మరొక భాగం మంజుల వద్ద మిగిలిపోయింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఇది దారుణమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు అధికారులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.