మంగళవారం, 30 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2025 (22:26 IST)

రైలు ఏసీ బోగీలో స్మోకింగ్ చేసిన మహిళ... నా డబ్బుతో తాగుతున్నా... మీకేంటి నొప్పా? (వీడియో)

woman smoking
ఓ మహిళా ప్రయాణికురాలు రైలు ఏసీ బోగీలో సిగరెట్ తాగుతూ రచ్చ చేసింది. దీన్ని ప్రశ్నించిన ప్రయాణికుడిపై ఆమె మండిపడింది. పైగా, స్మోకింగ్ చేస్తే మీకేంటి నొప్పి అంటూ ఫైర్ అయింది. నా డబ్బుతో తాగుతున్నా.... మీకేంటి నొప్పా అంటూ ఎదురుదాడి చేసింది. పైగా, పోలీసులను పిలుచుకోండంటూ సవాల్ విసిరింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖపట్టణం నుంచి గాంధీధామ్ వెళుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ (రైలు నంబర్ 20803)లో జరిగింది. ఏసీ కోచ్‌లో ఉన్న ఓ మహిళ సిగరెట్ వెలిగించి పొగ వదలడం మొదలుపెట్టింది. దీంతో ఇబ్బందిపడిన ఓ ప్రయాణికుడు.. ఏం చేస్తున్నారు.. ఇది ఏసీ కోచ్ అని కనిపించడం లేదా? లోపల సిగరెట్ ఎందుకు తాగుతున్నారు? అని ప్రశ్నించారు. 
 
అదేసమయంలో ప్రయాణికుడు ఈ తతంగాన్ని వీడియో తీయడం గమనించిన ఆ మహిళ మరింత ఆగ్రహానికి గురైంది. ఎందుకు నా వీడియో తీస్తున్నావ్.. వెంటనే డిలీట్ చెయ్.. అంటూ గట్టిగా అరిచింది. అందుకు ఆ ప్రయాణికుడు నిరాకరించడంతో మీకేంటి ఇదేమీ మీ రైలు కాదు కదా.. నా డబ్బులతో సిగరెట్ తాగుతున్నా అంటూ ఎదురు సమాధానం ఇచ్చింది. 
 
బయటకు వెళ్లి తాగాలని ప్రయాణికులు సూచించగా, ముందు తన వీడియో డిలీట్ చేయాలని ఆమె షరతు విధించింది. ఈ రైలు మీదా? నేను బయటకు వెళ్లనని చెప్పానా? లేదు కదా... మరి వీడియో ఎందుకు డిలీట్ చేయడం లేదు అని వాదించింది. దానికి ఆ ప్రయాణికుడు, అసలు విషయం అది కాదు.. ముందు మీరు లోపల ఎందుకు సిగరెట్ తాగుతున్నారు.. అని మళ్లీ ప్రశ్నించాడు. దీంతో తన కింద బెర్తుపై కూర్చొని వెళ్లి పోలీసులను పిలుచుకోండి అంటూ సవాల్ విసిరింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.