బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 16 ఏప్రియల్ 2025 (16:56 IST)

రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)

woman washed away in river
సోషల్ మీడియాలో కొన్ని వ్యూస్ కోసం, ఫాలోయర్స్ ప్రశంసల కోసం పలువురు తాము చేసే పనుల వల్ల ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి విషాదకర ఘటన ఉత్తరకాశిలోని మణికర్ణిక ఘాట్ వద్ద జరిగింది.
 
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశిలోని మణికర్నిక ఘాట్ వద్ద ఓ మహిళ రీల్ చేయాలనుకుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న గంగానదిలోకి దిగింది. మోకాలి లోతు వరకూ వెళ్లి.. ఇంకాస్త లోపలికి అడుగు వేసింది. అంతే... ఆ అడుగు జారడంతో నదిలో పడిపోయి కొట్టుకుపోయింది. నది ఒడ్డున వున్న బాలిక గొంతు... అమ్మ అనే అరుపు వినిపిస్తోంది. నదిలో కొట్టుకుపోయిన మహిళ మృతదేహం కోసం గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు.