శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జూన్ 2024 (10:07 IST)

శనివారం.. నువ్వులనూనె, నల్లబెల్లం, నల్లగొడుగులను..?

శనివారం గన్నేరు చెట్టుని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. సూర్యభగవానుడి, శనిదేవుని అనుగ్రహం పొందాలంటే శంఖం మొక్కను పూజించడం వల్ల ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. శనివారం గన్నేరు మొక్కకు నీరు సమర్పించండి. తర్వాత మొక్క చుట్టూ ఎర్రటి దారాన్ని చుట్టి ముడి వేయాలి. ఈ రెమెడీ పాటిస్తే వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. 
 
అలాగే శనిశ్వరుడితో పాటు సూర్యదేవుని పూజిస్తే జీవితంలో గౌరవం, సంతోషం, ఐశ్వర్యం పొందవచ్చు. శనివారం గన్నేరు పువ్వులతో శనిశ్వరుడిని పూజిస్తే జీవితంలో సుఖ సంతోషాలుంటాయని నమ్మకం.
 
శనివారం నలుపు రంగు దుస్తులను దానం చేయవచ్చు. ఇంకా కాకులకు పెట్టే ఆహారంలో కూడా నువ్వులు లేదా నల్ల శనగలు వుండేలా చూసుకోవాలి. శనివారం శివుడు, హనుమంతుడు, శనీశ్వరునికి ప్రార్థనలు చేయడం ఉత్తమం. పూజలో నల్లబెల్లం, నూనె, నువ్వులు నైవేద్యంగా ఉంటాయి. శనివారం నల్లని వస్త్రాలు, నల్ల గొడుగులను దానం చేయడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి.