శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 జనవరి 2024 (17:23 IST)

అయోధ్యలో రామమందిరం.. 48 రోజులు సుందరకాండ చదివితే?

sitarama
ప్రధాని మోదీ చేతుల మీదుగా అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడు కొలువుతీరిన సంగతి తెలిసిందే. ఇకపై రామ్ లల్లాను 'బాలక్ రామ్'గా పిలవనున్నట్టు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయంలో కొలువుతీరిన శ్రీరాముడు ఐదేళ్ల పసిబాలుడని... అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించామని చెప్పారు. 
 
అయోధ్యలో కొలువైన బాల రాముడిని వీక్షించేందుకు భక్తులు భారీ ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. చేరుకోని భక్తులు వున్న చోటే రామ స్మరణ చేస్తున్నారు. అయోధ్యలో రామునిని చూసేందుకు వీలు లేని వారు ఇంట రామ పటం ముందు నేతి దీపం వెలిగించి.. శ్రీరామజయంతో రాముడిని స్మరించడం చేయొచ్చు. 
 
అలాగే 48 రోజుల పాటు లేదా 21 రోజుల పాటు సుందరకాండ పారాయణం చేయడం ద్వారా శ్రీరామ అనుగ్రహం లభిస్తుంది. ఇంకా కోరిన కోరికలు నెరవేరుతాయి. శ్రీ రామానుజాచార్యుల వారు సుందరకాండ పారాయణానికి 16 రోజులు శ్రేష్ఠమని చెప్పారు. పట్టాభిషేక సర్గను చదివి శ్రీరామునికి, హనుమకు నైవేద్యాన్ని సమర్పించి భక్తితో స్తుతించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి.