శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (11:43 IST)

రుతుక్రమ దోషాలను తొలగించే రుషి పంచమి.. పూజ ఇలా చేస్తే?

Rishi Panchami
Rishi Panchami
ఋషి పంచమి లేదా రిషి పంచమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున దీనిని జరుపుకుంటారు. ఈ రోజున ఏడుగురు మహర్షులను పూజించడం వల్ల జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి. పంచాంగం ప్రకారం, ఋషి పంచమి సెప్టెంబర్ 1, గురువారం వస్తుంది.  
 
అఖండ సౌభాగ్యం కోసం రుషి పంచమి రోజున వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల రుతుక్రమ దోషాలు తొలగిపోతాయి. 
Rishi Panchami
Rishi Panchami


ఋషి పంచమి రోజున మహిళలు గంగానదిలో స్నానం చేస్తే, దాని ఫలితాలు అనేక రెట్లు పెరుగుతాయని నమ్ముతారు. ఈ రోజున సప్త ఋషులకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీళ్లతో అభిషేకం చేయాలి. ఆపై పూజ చేయడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి.