గురువారం అరటిచెట్టును పూజిస్తే.. ఆ దోషం తొలగిపోతుందట..
అరటి ఆకు అత్యంత పవిత్రమైనది. గురువారం నాడు అరటి చెట్టును పూజించడం ద్వారా భగవంతుని ఆశీర్వాదంతో గృహంలో శుభశక్తి పెరగడం ప్రారంభమవుతుంది. అంతేకాదు ఆర్థికాభివృద్ధి కూడా జరుగుతుంది. ప్రతి గురువారం అరటి చెట్టును పూజించడం వల్ల ఉద్యోగ, సామాజిక జీవితంలో కీర్తి, గౌరవం పెరుగుతాయి.
ప్రతి గురువారం పూజ చేసిన భక్తుడు మంచి ఆరోగ్యం, సంపద, విజయం, జీవితంలో మంచి భాగస్వామిని పొందుతారని విశ్వాసం. ప్రతి గురువారం అరటి చెట్టును పూజించడం ద్వారా మంగళ దోషం తొలగిపోతుంది. దీనివల్ల ప్రమాదాలు తగ్గుతాయి.
అలాగే వైవాహిక జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉండదు. విష్ణువు, లక్ష్మీ దేవి, గణేశ పూజ సమయంలో అరటి ఆకులను సమర్పిస్తే జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
అరటి చెట్టు భూమిపై బృహస్పతి నివాసంగా చెబుతారు. గురువారం బృహస్పతి స్వరూపమైన అరటి చెట్టును పూజిస్తే సర్వశుభాలు చేకూరుతాయి.
ఇంకా గురువారం పూట మౌనవ్రతం పాటించడం మంచిది.
అరటి చెట్టు వేర్లను నీరు పోసి.. పువ్వులు సమర్పించాలి.
అరటి చెట్టుకు పసుపు, బెల్లం సమర్పించాలి. ఆపై ధూపం హారతి సమర్పించాలి.
ఈ విధంగా అరటి చెట్టు పూజ చేయడం ద్వారా, ఒక వ్యక్తి బృహస్పతి దేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. విష్ణువు అనుగ్రహాన్ని పొందవచ్చు.