శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జులై 2023 (18:39 IST)

బల్లులు ఇంట్లో అరుస్తున్నాయా? ఎక్కువగా కనిపిస్తున్నాయా?

Lizard
బల్లులు శరీరంపై పడితే ఒక్కో ఫలితం వుంటుంది. అయితే బల్లు ఇంట్లో సంచరించకూడదని బల్లిశాస్త్రం చెప్తోంది. బల్లులు ఇంట్లో తరచుగా అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో నివసించే వారికి ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటుందని సంకేతమని బల్లి శాస్త్రం వెల్లడిస్తోంది. 
 
అలాగే ఇంట్లోకి వెళ్తున్నప్పుడు బల్లి కీటకాన్ని మింగుతూ కనిపిస్తే ఆ ఇంటి యజమాని తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారనేది విశ్వాసం. బల్లులు ఇంట్లో పదే పదే కనిపించినా అది చెడుకి సంకేతం కాబట్టి వాటిని ఇంట్లో లేకుండా తరిమికొట్టాలి. 
 
అలాగని వాటిని చంపకూడదు. చంపితే పెద్ద దోషం జీవితాన్ని ఎల్లవేళలా ప్రభావితం చేస్తుంది. అందుకే బల్లులను తరిమికొట్టే చిట్కాలను పాటించాలి. బల్లి శాస్త్రం ప్రకారం ఇంట్లో రెండు బల్లులు ఒకదానికొకటి కొట్టుకుంటూ కనిపిస్తే దానిని ఒక అపశకునంగా భావించాలని బల్లి శాస్త్రం చెప్తోంది.