శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2024 (09:14 IST)

చొల్లంగి అమావాస్య రోజున నల్ల నువ్వుల దానం చేస్తే?

Amavasya
Amavasya
చొల్లంగి అమావాస్య రోజున నువ్వులు, నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. పితృదోషాలు తొలగిపోవాలంటే.. ఈ అమావాస్య రోజున ఉపవాసం వుండి.. పితరులకు అన్నం సమర్పించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఇంకా ఈ ఉపవాసం ద్వారా చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని విశ్వాసం. చొల్లంగి అమావాస్య రోజున తప్పనిసరిగా నల్ల నువ్వుల లడ్డూలు, నువ్వుల నూనె, దుప్పటి, ఉసిరి కాయలు, నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయాలి. 
 
ఇలా చేయడం వల్ల పితృ దోషం తొలగిపోతుంది. ఈ రోజున రావి చెట్టుకు తెల్లటి మిఠాయిలను సమర్పించి.. చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేయండి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి.