శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (21:17 IST)

ధనం చేతికి అందాలా..? శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి చెప్పిన చిన్న మంత్రం..?

Sri Chandrasekharendra Saraswati
Sri Chandrasekharendra Saraswati
"లలితం శ్రీధరం.. లలితం భాస్కరం.. లలితం సుదర్శనం.." ఈ మంత్రాన్ని రోజు తొమ్మిది సార్లు పఠిస్తే ధనప్రాప్తి చేకూరుతుందని జగద్గురు, పరమాచార్య, మహాస్వామి అని పిలువబడే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి పేర్కొన్నారు. 
 
కంచి కామకోటి పీఠం జగద్గురుగా (1894 మే 20, – 1994 జనవరి 8 కాలం మధ్య) అధిష్టించిన వారి వరసక్రమంలో 68వ వారు. ఈయన తనను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సమస్యలను తీర్చేందుకు మంత్రోపాయం చెప్పేవారు. 
 
ఈ క్రమంలో ఆపదలో వున్నప్పుడు, ఆర్థిక కష్టాలొచ్చినప్పుడు.. ధనసాయం అవసరమైన సందర్భంలో "లలితం శ్రీధరం.. లలితం భాస్కరం.. లలితం సుదర్శనం.." అనే మంత్రాన్ని రోజూ తొమ్మిది సార్లు పఠించడం ద్వారా ధనం తప్పకుండా చేతికి అందుతుందని చెప్పారు. 
 
అలాగే ధనసహాయం కోసం వేచి చూస్తున్న వేళ రావలసిన చోట నుంచి ధనం రావాలన్నా.. ఈ మంత్రాన్ని జపిస్తే చాలునని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి పేర్కొన్నారు. ఈ మంత్రాన్ని రోజుకు తొమ్మిది సార్లైనా 108 సార్లైనా పఠిస్తే ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయన్నది కంచి కామకోటి మఠాధిపతి వాక్కు.