శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (16:57 IST)

బాలాపూర్ లడ్డుకు రికార్డు ధర... సొంతం చేసుకున్న శంకర్ రెడ్డి

balapur laddu
హైదరాబాద్ బాలాపూర్ లడ్డూ మరోమారు రికార్డు స్థాయి ధర పలికింది. మంగళవారం ఉదయం లడ్డూ వేలం పాటలు నిర్వహించింది. గత యేడాది ఈ లడ్డూ ధర రూ.27 లక్షల ధర పలుకగా, ఈ యేడాది ఈ ధర రూ.30 లక్షల మేరకు పలికింది. ఈ లడ్డూను కొలను శంకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. క్రితం యేడాది దాసరి దయానంద రెడ్డి రూ.27 లక్షలకు దక్కించుకున్నారు కాగా, లడ్డూ వేలం పాట ముగియడంతో మరికాసేపట్లో గణేశుడు శోభాయాత్ర చేపట్టనున్నట్టు బాలాపూర్ నిర్వాహకులు వెల్లడించారు. 
 
కాగా, బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట తొలిసారి 1994 నుంచి జరుగుతుంది. వారం పాటు స్వామివారితో పాటు పూజలందుకున్న లడ్డూను చివరి రోజు వేలం వేయడం ప్రారంభమవుతుంది. బాలాపూర్ ముఖ్య కూడలిలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించడం ఆనవాయితి. తొలి యేడాది వేలం పాటలో బాలాపూర్ లడ్డూ ధర రూ.450లకు ఓ భక్కుడు కొనుగోలు చేశాడు. 2020లో కరోనా కారణంగా ఈ వేలం పాటను రద్దు చేశారు.