శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (12:19 IST)

మెదక్ : రెండు కాలేజీ బస్సులు ఢీ.. డ్రైవర్ మృతి.. పదిమందికి గాయాలు (Video)

BVRIT College buses
BVRIT College buses
తెలంగాణలోని మెదక్ జిల్లాలో రెండు కాలేజీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎదురుగా వస్తున్న బస్సులోని డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా మరో బ‌స్సు డ్రైవ‌ర్‌తో స‌హా ప‌ది మంది విద్యార్థుల‌కు తీవ్రగాయాలు అయ్యాయి. 
 
ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. బీవీ రాజు ఇ‌ని‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన బస్సు ఉదయం విద్యార్థులను పికప్ చేసుకుని కాలేజీకి బయలుదేరింది. ఈ క్రమంలోనే ఓ వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తున్న క్రమంలో అదే కళాశాలకు చెందిన మరో బస్సును బలంగా ఢీకొట్టింది.