కాటేదాన్ రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం... దట్టంగా కమ్ముకున్న పొగలు
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని కాటేదాన్‌లో ఉన్న ఓ రబ్బర్ ఫ్యాక్టరీలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ రబ్బరు పరిశ్రమలో ఉన్నట్టుండి మంటలు ఒక్కసారిగా చెలరేగి, పొగలు దట్టంగా కమ్ముకున్నాయి.
దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, ఫైరింజిన్ విభాగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. మొత్తం నాలుగు ఫైరింజన్లు రంగంలోకి దించి మంటలను అదుపు చేశాయి.
పరిశ్రమలో పెద్ద ఎత్తున రబ్బరు, ఇతర ముడి సరుకు ఉండటంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీనివల్ల ఆ ప్రాంతమంతా నల్లటి దట్టమైన పొగలు కమ్ముకుని ఉక్కిరి బిక్కిరి చేశాయి. అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి చివరకు మంటలను పూర్తిగా ఆర్పివేశాయి. ఈ ప్రమాదం కారణఁగా జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించిన వివరలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.