శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2024 (09:06 IST)

సమంత విడాకుల అంశంలో నా మాటలు తప్పే.. కానీ.. : మంత్రి కొండా సురేఖ

Konda surekha
హీరోయిన్ సమంత - అక్కినేని నాగ చైతన్య విడాకుల అంశంపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని, అందుకే తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్టు తెలంగాణ మంత్రి కొండా సురేఖ తెలిపారు. సమంత విడాకుల అంశంలో తాను చేసిన వ్యాఖ్యలు తప్పే కావొచ్చు అని తెలిపారు. కానీ, నాగ చైతన్య, సమంతలు ఎందుకు విడిపోయారో ఇప్పటివరకు ఎవరికీ తెలియదని, విడాకులు కారణంపై ఇటు నాగార్జున కుటుంబ, అటు సమంత నుంచి ఎవరూ చేప్పలేదన్నారు. 
 
పరిశ్రమ నుంచి వచ్చిన అంతర్గత సమాచారాన్ని మాత్రమే తాను చెప్పానని, ఆ మాటలు తాను కోపంలో అన్నానని వెల్లడించారు. తాను ఎపుడూ నిజాలే మాట్లాడుతానని, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని మాట్లాడే రకం కాదన్నారు. కేటీఆర్‌ను మాత్రం వదిలే ప్రసక్తే లేదన్నారు. మళ్లీ ఇదే రిపీట్ అయితే, కేటీఆర్‌ను హైదరాబాద్ నగరంలోనే కాదు జిల్లాల్లో కూడా తిరగనివ్వబోమని హెచ్చరించారు. 
 
మెట్టు దిగిన మంత్రి కొండా సురేఖ... సమంతపై చేసిన వ్యాఖ్యలను బేషరతుగా.. 
 
అక్కినేని నాగ చైతన్య, ఆయన మాజీ భార్య సమంతలను ఉద్దేశించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం, చర్చనీయాంశంగా మారాయి. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే, హీరోయిన్ సమంత కూడా మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను రాక్షసితో పోల్చారు. ఈ సమస్య పెద్దదవుతుందని గ్రహించిన మంత్రి కొండా సురేఖ ఓ మెట్టు దిగి.. సమంతను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటునట్టు తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇదే అంశంపై ఆమె ట్వీట్ చేశారు. 
 
"తన వ్యాఖ్యలను ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయుకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడం మాత్రమేనని అన్నారు. కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదని స్పష్టం చేశారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు ఆదర్శనం అని మంత్రి కొండా సురేఖ అన్నారు. తన వ్యాఖ్యల వల్ల సమంత కానీ, ఆమె ఫ్యాన్స్ కానీ మనస్తాపానికి గురైనట్టయితే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు.