శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2024 (15:12 IST)

అల్లు అర్జున్ అరెస్టు పాలకులు అభద్రతకు పరాకాష్ట : కేటీఆర్

ktrao
హీరో అల్లు అర్జున్‌ అరెస్టుపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ అరెస్టు పాలకుల అభద్రతకు పరాకాష్ట అంటూ వ్యాఖ్యానించారు. తొక్కిసలాట బాధితుల పట్ల తనకు పూర్తిగా సానుభూతి వుందన్నారు. కానీ ఆ ఘటనలో వాస్తవంగా విఫలమైంది ఎవరిని ఆయన ప్రశ్నించారు. అల్లు అర్జున్‌కు నేరుగా ఎలాంటి సంబంధం లేని కేసులో ఆయనను ఒక సాధారణ నేరస్తుడిగా చూడటం సరికాదని గుర్తుచేశారు. 
 
గౌరవం, గౌరవప్రదరమైన ప్రవర్తనకు ఎపుడూ స్థానం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఇదే లాజిక్‌తో వెళితో హైడ్రా సృష్టించిన భయాందోళనల కారణంగా హైదరాబాద్ నగరంలో ఇద్దరు అమాయకులు చనిపోయారని దీనికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలని స్పష్టంచేశారు.