దసరాకు బంద్ కానున్న మద్యం షాపులు.. డీలా పడిపోయిన మందు బాబులు
తెలుగు రాష్ట్రాల్లో దసరా అతిపెద్ద పండుగలలో ఒకటి. ఈ సందర్భంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఏకం అవుతారు. నవరాత్రి సమయంలో చాలామంది ఉపవాసం ఉంటారు. ఈ సంవత్సరం, దసరా అక్టోబర్ 2న వస్తుంది. ఈ రోజున గాంధీ జయంతి కావడం మద్యం షాపులు బంద్ కానున్నాయి.
భారతదేశం అంతటా, ఈ రోజున మద్యం అమ్మబడదు. కాబట్టి వైన్ దుకాణాలు మూసివేయబడతాయి. దీంతో మందుబాబులు డీలా పడిపోతున్నారు. మద్యం దుకాణాలు ఇప్పటికే మూసివేత గురించి నోటీసులను ప్రదర్శించాయి.
మద్యం అందుబాటులో ఉండదని పోస్ట్‌లు, రీల్స్‌తో సోషల్ మీడియా నిండిపోయింది. ఈ సోషల్ మీడియా పుణ్యమాని మందుబాబులు ముందుగానే మందుబాటిళ్లు కొని స్టాక్ చేసేస్తారు లాగుంది.