రాయదుర్గంలో రికార్డు స్థాయిలో భూమి ధర.. ఎకరం భూమి రూ.177 కోట్లు
హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ బూమ్ ఒక్కసారిగా తారాస్థాయికి పెరిగిపోయింది. నగర శివారు ప్రాంతమైన రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం భూమి ధర ఏకంగా రూ.177 కోట్లు పలికింది. ఈ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాన్ని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తాజాగా వేలం వేసింది.
ఈ వేలం పాటల్లో పాల్గొన్న ఎంఎస్ఎన్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ఎకరం స్థలాన్ని ఏకంగా రూ.177 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఒక ఎకరం రూ.177 కోట్లు చెప్పున మొత్తం 7.6 ఎకరాల భూమిని రూ.1357 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇదిలావుంటే, తెలంగాణ హౌసింగ్ బోర్డు ఫ్లాట్ల విక్రయాల్లోనూ రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. కుతుబుల్లాపూర్ పరిధిలోని చింతల్‌లో చదరపు గజం రూ.1.14 లక్షలకు అమ్ముడుపోయింది.