శుక్రవారం, 14 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 మార్చి 2025 (12:10 IST)

Python- ఖమ్మం జిల్లాలో రోడ్డుపై కనిపించిన కొండ చిలువ.. వాహనదారులు ఏం చేశారంటే? (video)

Python
Python
కొండ చిలువలకు సంబంధించిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అయిన దాఖలాలున్నాయి. తాజాగా భారీ కొండ చిలువకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఖమ్మం జిల్లాలో రోడ్డుపై భారీ కొండ చిలువ కనిపించింది. ఖమ్మం రూరల్ మండల కేంద్రంలో కరుణగిరి బైపాస్ రోడ్డు వద్ద భారీ కొండ చిలువ రోడ్డుపై కనిపించింది. వాహనదారులు కొండచిలువను చూసి అప్రమత్తమయ్యారు. వాహనాలను నిలిపివేశారు. 
 
ఈ కొండచిలువ రోడ్డు దాటుకుని వెళ్లేంతవరకు వేచి వున్నారు. ఈ సందర్భంగా వాహనాదారులు కొండచిలువను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.