శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (15:40 IST)

తిరుమల శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్

Chandrachud
Chandrachud
తిరుమల శ్రీవారి ఆలయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద టీటీడీ ఈవో ఘనస్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ చంద్రచూడ్ గర్భాలయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. 
 
ప్రార్థనల అనంతరం రంగనాయకుల మండపంలో ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సభ్యులను ఆలయ పండితులు ఆశీర్వదించారు. ఆపై టీటీడీ ఈవో ఆయనకు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సివిఎస్వో శ్రీధర్, డెప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. 

DY Chandrachud
DY Chandrachud