బుధవారం, 3 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 సెప్టెంబరు 2025 (19:30 IST)

తెలంగాణాలో దసరా సెలవులు ఎప్పటి నుంచో తెలుసా?

telangana state
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల కోసం ఆ రాష్ట్ర విద్యాశాఖ దసరా సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు వేర్వేరు తేదీల్లో సెలవులు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 21వ తేదీ నుంచి దసలా సెలవులు ప్రారంభమవుతాయి. ఈ సెలవులు అక్టోబరు 3వ తేదీ వరకు కొనసాగుతాయి. విద్యార్థులకు దాదాపు 13 రోజుల పాటు పండగ సెలవులు లభించనున్నాయి. 
 
జూనియర్ కాలేజీలకు ఈ నెల 28వ తేదీ నుంచి సెలవులు ఇవ్వనున్నట్టు విద్యాశాఖ తెలిపింది. ఈ సెలవులు అక్టోబరు 3వ తేదీ వరకు కొనసాగుతాయి. విద్యార్థులకు దాదాపు 13 రోజుల పాటు పండగ సెలవులు లభించనున్నాయి. జూనియర్ కాలేజీలకు ఈ నెల 28వ తేదీ నుంచి సెలవులు ఇవ్వనున్నట్టు విద్యాశాఖ తెలిపింది. ఈ సెలవులు అక్టోబరు 5వ తేదీతో ముగుస్తాయి. అక్టోబరు 6వ తేదీ నుంచి కళాశాలలు తిరిగి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.