ప్రేమికుల రోజున బైకులపై స్టంట్లు చేయొద్దు.. సజ్జనార్ హితవు (Video)
ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజును ప్రేమికులు జరుపుకోనున్నారు. ఆ రోజున ప్రియురాలు లేదా ప్రియుడుని సంతృప్తి పరిచేందుకు వివిధ రకాలైన బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే, కొందరు ప్రేమికులు మరింతగా రెచ్చిపోయి.. ఖరీదైన బైకులపై తమ ప్రియురాళ్లను ఎక్కించుకుని రద్దీగా ఉండే రహదారులపై స్టంట్లు చేస్తుంటారు. ఇలాంటి వారికి తెలంగాణ రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఒక సూచన చేశారు.
ప్రేమికుల రోజును పురస్కరించుకుని పలువురు యువత బైకులపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, అతి వేగం ప్రమాదకరమన్నారు. ఇలాంటి విన్యాసాలు ఆ సమయానికి సరదాగా అనిపింవచ్చు కానీ, జరగరానిది జరిగితే ఏమవుతుందో ఊహించుకోండి అని అన్నారు. ఇలాంటి సాహసాలు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని, కుటుంబ సభ్యులను మనోవేదనకు గురిచేయకండి అని అంటూ వీసీ సజ్జనార్ హితవు పలికారు.