శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 జులై 2024 (15:47 IST)

సెల్ఫీ పిచ్చి వద్దు... జీవితాలను నాశనం చేసుకోకండి: సజ్జనార్ సీరియస్

selfie
మెక్సికోలో సెల్ఫీ మోజుతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మెక్సికోలో ఓ యువతి రైలుతో సెల్ఫీ దిగే ప్రయత్నంలో దుర్మరణం చెందింది. మెక్సికోలోని హిడాల్గోలో ఆవిరి ఇంజిన్‌తో నడిచే రైలును చూసేందుకు నిత్యం ఔత్సాహికులు రైలు పట్టాల వద్ద క్యూ కడుతుంటారు. 
 
ఓ యువతి కూడా సెల్ఫీ దిగే క్రమంలో అత్యుత్సాహంతో ప్రాణాలు పోగొట్టుకుంది. సెల్ఫీ బాగా రావాలనే ప్రయత్నంలో ఆమె పట్టాలకు బాగా దగ్గరగా జరిగింది. 
 
ఈ క్రమంలో ఆమెను రైలు ఢీకొట్టడంతో తలభాగంలో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ అయ్యింది. దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. 
 
ఈ ఘటనను పిన్ చేస్తూ సెల్ఫీ పిచ్చి బాగా ముదిరిపోతోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ఫీల మోజులో పడి ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు.
 
సోషల్ మీడియా పాపులారిటీ మత్తులో పడి.. జీవితాలను నాశనం చేసుకోకండి. అంటూ సజ్జనార్ హితవు పలికారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.