శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (09:01 IST)

వరిపొలంలో మొసలి.. బెంబేలెత్తిపోయిన రైతులు - కూలీలు (Video)

crocodile
ఈ మధ్యకాలంలో పులులు, చిరుత పులులు, సింహాలు, తోడేలు, మొసళ్లు వంటివి జనావాస ప్రాంతాల్లోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం, కంచిరావుపల్లి గ్రామ సమీపంలోని ఓ వరిపొలం మొసలు కనిపించింది. ఈ వ్యవసాయ పొలంలో భారీ మొసలు ఉన్నట్టు స్థానిక రైతులు, కూలీలు గుర్తించి భయంతో వణికిపోయారు. 
 
ఈ విషయాన్ని వనపర్తిలోని సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణసాగర్‌కు చెప్పడంతో ఆయన బృందంతో చేరుకుని తాళ్ల సాయంతో మొసలిని చాకచక్యంగా బంధించారు. ఈ మొసలి 13 అడుగులు పొడవు, సుమారు 300 కేజీల బరువు ఉంటుందని ఆయన తెలిపారు. ఆ తర్వాత గ్రామస్థులంతా కలిసి ఆ మొసలిని బీచుపల్లి వద్ద కృష్ణానదిలో వదిలిపెట్టారు.