శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2024 (11:51 IST)

చిత్తు కాగితాలు సేకరించి జీవించే మహిళపై సామూహిక అత్యాచారం

crime
చిత్తు కాగితాలు సేకరించి జీవిస్తున్న మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలు మృతి చెందింది. సోమవారం మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఇద్దరు యువకులు బాధితురాలితో మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఈ దారుణానికి పాల్పడిన అనంతరం వారిద్దరూ బైక్‌పై కూకట్‌పల్లి వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
 
మూసాపేట వై జంక్షన్ సమీపంలోని వాణిజ్య సముదాయం వద్ద ఆదివారం ఉదయం ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం పక్కనే చిత్తు కాగితాలతో కూడిన సంచి ఉంది. 
 
మృతదేహంపై బట్టలు చిరిగి వుండటంతో పాటు రక్తస్రావం కావడంతో బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. 
 
ఘటనాస్థలికి సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఇద్దరు యువకులు బాధితురాలితో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి.