శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2023 (19:26 IST)

ముంబైలో రూ.15.75 కోట్ల లగ్జరీ అపార్ట్‌మెంట్‌ కొన్న అక్షరా హాసన్

akshara-kamal-sruthi
సినీ లెజెండ్ కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ ముంబైలోని ఖార్ ప్రాంతంలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. అక్షర హాసన్, ముంబైలోని పశ్చిమ శివారు ప్రాంతమైన ఖార్‌లో ఒక లగ్జరీ ప్రాజెక్ట్‌లో 2,354 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రూ. 15.75 కోట్లకు కొనుగోలు చేసినట్లు బిటౌన్ వర్గాల సమాచారం. 
 
అపార్ట్‌మెంట్ ఏక్తా వెర్వ్‌లోని 13వ అంతస్తులో ఉంది. ఇది ఖార్‌లోని రోడ్ నంబర్ 16లో 15 అంతస్తుల లగ్జరీ టవర్‌లో ఉంది. 2,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన బాల్కనీని కలిగి ఉంది. రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఫ్లాట్‌లో మూడు కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి.
 
బాంద్రా దంపతులకు, అక్షరా హాసన్‌కు మధ్య ఆస్తి విక్రయానికి సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఈ డీల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 27న పూర్తయింది. కాగా... అక్షర నటుడు కమల్ హాసన్-సారిక ఠాకూర్‌ల చిన్న కుమార్తె. ఈమె శృతి హాసన్ చెల్లెలు. అక్షర కొన్ని హిందీ, తమిళ చిత్రాలలో నటించింది. ఆమె 2015లో అమితాబ్‌తో తొలిసారిగా నటించింది.