శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2024 (14:09 IST)

టిల్లు స్క్వేర్ ఎఫెక్ట్.. ఆఫర్ల వెల్లువ.. ఆక్టోపస్‌పై చాలా ఆశలు

Anupama, siddu
అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే టిల్లు స్క్వేర్ సినిమాతో బాగా ఫేమస్ అయిపోయింది. యంగ్, టాలెంటెడ్ హీరోయిన్లలో ఒకరైన అనుపమకు టిల్లు స్క్వేర్‌తో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆమె ప్రాధాన్యత గల రోల్స్ ఎంచుకుంటోంది. తన తదుపరి చిత్రం ఆక్టోపస్‌పై చాలా ఆశలు పెట్టుకుంది. ఇందులో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. 
 
మరోవైపు, సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కూడా తన తదుపరి చిత్రాన్ని త్వరలో చేయబోతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. ఆ మధ్య అనుపమ కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కొత్త సినిమా పట్టాలెక్కింది.
 
బెల్లంకొండ తదుపరి చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. ఇందులో అనుపమ కూడా నటించింది. కిష్కింధాపురి అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని సమాచారం. ఈ సినిమాలో అనుపమ క్యారెక్టర్ ద్వారా పెద్దగా మెరిసిపోతుందని టీమ్ భావిస్తోంది. అదే సమయంలో అనుపమ కూడా మలయాళ సినిమాల్లో బిజీ అవుతోంది.