Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !
నందమూరి బాలకృష్ణ హీరోగా “అఖండ 2” చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల షూటింగ్ చేశారు. తాజాగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ నటించనుంది. అఖండలో చిన్న పాప పాత్ర వుంది. ఇప్పుడు దర్శకుడు బోయపాటి శ్రీను ఆ పాత్రకు కొనసాగింపుగా పెడుతున్నారు. ఈ పాత్రకు సీనియర్ నటి లయ కుమార్తె శ్లోకా నటించనున్నట్లు తెలుస్తోంది. నటి లయ కొంతకాలం అమెరికా వెళ్లి మరలా తిరిగి హైదరాబాద్ వచ్చింది.
రాగానే కొన్ని సినిమాలు చేయడానికి సిద్ధమైంది. నితిన్ తో రాబిన్ హుడ్ లో నటించింది. నటుడు శివాజీకి భార్యగా కొత్త సినిమాలో నటించనుంది. కాగా, ఇప్పుడు తన కుమార్తె శ్లోకా ను బాలయ్య సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతుంది. ఇప్పటికే ఆమెను చిత్ర టీమ్ సంప్రదించినట్లు సమాచారం. ఇక బాలక్రిష్ణ కూడా జైలర్ 2 సినిమాలో గెస్ట్ రోల్ లో నటించనున్నట్లు తెలుస్తోంది.