శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2024 (17:42 IST)

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

suman
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు థియేటర్ యాజమాన్యమే బాధ్యత వహించాలని సినీ నటుడు నటుడు అభిప్రాయపడ్డారు. "పుష్ప-2" ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో ఏ11గా ఆ చిత్ర హీరో అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. దీనిపై నటుడు సుమన్ స్పందించారు. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ప్రమేయం లేదని అన్నారు. బన్నీని అరెస్టు చేయడం సరికాదని వ్యాఖ్యానించరు. జరిగిన ఘటన దురదృష్టకరమని చెప్పారు. ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యమే బాధ్యత తీసుకోవాలని అన్నారు.
 
ఒక స్టార్ హీరో థియేటర్‌కు వస్తున్నపుడు తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత థియేటర్ యాజమాన్యానిదే అని సుమన్ చెప్పారు. థియేటర్ వద్ద ఎంతమంది జనం ఉన్నారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది యాజమాన్యమే చూసుకోవాలని అన్నారు. తాను హీరోగా ఉన్నపుడు థియటర్ యాజమానులు తనను ఆహ్వానించేవారని తాను వెళ్ళినపుడు తగిన ఏర్పాట్లు చేసేవారిని చెప్పారు. నటులు థియేటర్‌కు వెళ్లొచ్చని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.