మంగళవారం, 9 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 సెప్టెంబరు 2025 (11:54 IST)

మోడల్ రంగ సుధపై బెదిరింపులు.. ఠాణాలో ఫిర్యాదు

ranga sudha
హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ మోడల్, నటి రంగ సుధకు బెదిరింపులు వచ్చాయి. రాధాకృష్ణ అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం. దీంతో ఆమె హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ అనే వ్యక్తి, కొన్ని ట్విట్టర్ పేజీలు తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి చేస్తున్నాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా, గతంలో తాము కలిసివున్న సమయంలో తీసిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు బయటపెడతానని గతంలో రాధాకృష్ణ తనను బెదిరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు విచారణ జరుపుతున్నారు.