బుధవారం, 10 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 9 సెప్టెంబరు 2025 (16:10 IST)

గ్రహణం రోజున తలపై మండే కుంపటితో అఘోర శ్రీనివాసరావు (video)

Aghora pooja at shiva Temple
గ్రహణాలు చెడు ఫలితాలను ఇస్తాయని విశ్వాసం వుంది. అందుకే ఆ సమయంలో చాలామంది ఇంటి నుంచి బైటకు రాకుండా భగవంతుని ధ్యానంలో వుంటుంటారు. ఐతే ఇదే సమయంలో కొంతమంది ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారని చెబుతారు.
 
గుంటూరు జిల్లా రెడ్డిపాలెం శివాలయం వద్ద అఘోర శ్రీనివాస రావు ప్రత్యేక పూజలు చేసినట్లు చెప్పుకుంటున్నారు. గ్రహణం రోజున తలపైన మండే కుంపటి పెట్టుకుని ఏవో పూజలు చేసినట్లు స్థానికులు అంటున్నారు. అవేమైనా క్షుద్రపూజలేమోనని సందేహాలు వెలిబుచ్చారు. ఐతే అఘోరా శ్రీనివాస రావు మాత్రం అవి క్షుద్రపూజలు కాదంటూ కొట్టిపారేశాడు.