Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!
బాలీవుడ్ మెగాస్టార్ అజయ్ దేవ్‌గన్ తన కొడుకు యుగ్ దేవ్‌గన్‌తో కలిసి ముంబైలో గ్రాండ్ ఈవెంట్‌లో సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా నిర్మించిన కరాటే కిడ్: లెజెండ్స్ హిందీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది తొలిసారి తండ్రీ-కొడుకులు కలిసి ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లో పని చేయడం కావడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గన్, జాకీ చాన్ పోషించిన మిస్టర్ హాన్ పాత్రకు హిందీలో తన గొంతునిచ్చారు. అదే సమయంలో యుగ్ దేవ్‌గన్ (Ben Wang పాత్ర - లీ ఫాంగ్) పాత్రకు డబ్బింగ్ చెప్పి, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తన బాలీవుడ్ ప్రయాణాన్ని ప్రారంభించారు.
తండ్రి-కొడుకుల మధ్య ఉన్న సహజమైన అనుబంధం ఈ కథలో mentor-student రిలేషన్‌షిప్‌ను మరింత హృద్యంగా మార్చనుంది. యుగ్‌లో కనిపించే కొత్త తరం ఎనర్జీ, గొంతులో ఉన్న పవర్ ఈ పాత్రకు కొత్త శక్తిని ఇస్తున్నాయి.
కరాటే కిడ్: లెజెండ్స్ కథ న్యూయార్క్ నేపథ్యంలో సాగుతుంది. కుంగ్ ఫూ ప్రతిభావంతుడు లీ ఫాంగ్ కొత్త పాఠశాలలో జీవితం ఎలా పోరాటంగా మారుతుందో, మిస్టర్ హాన్, డేనియల్ లారూసో (రాల్ఫ్ మాకియో) మార్గనిర్దేశంలో అతను ఎలా ఎదుగుతాడో ఈ కథ చెబుతుంది. ఈ సినిమా ద్వారా ఓ తరం వారసత్వాన్ని మరో తరానికి అందించడమే కాదు, భారతీయ ప్రేక్షకులకు కరాటే కిడ్ లెగసీని దగ్గర చేస్తోంది.