శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (12:29 IST)

విష్ణు మంచు కన్నప్ప’షూట్‌లో అడుగు పెట్టిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్

Akshay Kumar Vishnu Manchu  mohanbabu
Akshay Kumar Vishnu Manchu mohanbabu
విష్ణు మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘భక్త కన్నప్ప’లోకి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ జాయిన్ అయ్యారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. మంచు విష్ణు ఈ సినిమాను భారీ ఎత్తున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో కన్నప్ప సినిమా రాబోతోంది. ఇప్పటికే న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో రెండు భారీ షెడ్యూల్స్‌ను కంప్లీట్ చేశారు.
 
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైద్రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఆల్రెడీ ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్‌లోకి బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ జాయిన్ అయ్యారు. ఈ మేరకు అక్షయ్ కుమార్‌కు మోహన్ బాబు, విష్ణు మంచు గ్రాండ్‌గా స్వాగతాన్ని పలికారు. ఇక ప్రస్తుతం అక్షయ్ కుమార్ మీద సీన్లను చిత్రీకరించనున్నారు. 
 
పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్రానికి రచయితలు. కన్నప్ప సినిమాను పాన్ ఇండియాగా అన్ని భాషల్లోనూ విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే. కన్నప్ప కథను అందరికీ తెలియపర్చే విధంగా కామిక్ బుక్స్‌ని కూడా రిలీజ్ చేయగా.. వాటికి మంచి స్పందన వచ్చింది.