బుధవారం, 3 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 డిశెంబరు 2025 (08:55 IST)

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

condome
చైనా దేశ జనాభా క్రమంగా తగ్గిపోతోంది. మరోవైపు, భారత్ జనాభా పెరుగుతోంది. దీంతో చైనా ఓ వింత నిర్ణయం తీసుకుంది. తమ దేశ ప్రజలు కండోమ్స్ వినియోగించి శృంగారంలో పాల్గొనకుండా ఉండేలా ఈ చర్య ఉంది. గత మూడు దశాబ్దాలుగా కండోమ్స్‌పై పన్ను మినహాయింపు ఇస్తూ వచ్చిన చైనా పాలకులు.. తొలిసారి కండోమ్‌లపై 13 శాతం శాతం వ్యాట్ విధిస్తున్నట్టు ప్రకటించింది. 
 
గత మూడేళ్ళుగా జననాల రేటు వరుసగా పడిపోతుండటంతో, తమ దేశ స్త్రీపురుషులు పిల్లలను కనేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఒకపుడు ఒకే బిడ్డ విధానాన్ని చాలా కఠినంగా అమలు చేసిన చైనా.. ఇపుడు అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటుంది. దీనికి కారణం ఆ దేశ జనాభా నానాటికీ తగ్గిపోతుండటమే. 
 
గత 1993లో ఒకే బిడ్డ విధానం అమల్లో ఉన్నపుడు కండోమ్‌లపై పన్నును తొలగించారు. ఇపుడు జనాభా తగ్గిపోతుండటంతో ఆ మినహాయింపును ఎత్తివేశారు. ఈ కొత్త పన్ను విధానం 2026 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకిరానుంది. మరోవైపు, పిల్లల సంరక్షణ కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, వివాహ సంబంధిత సేవలపై వ్యాట్‌ను రద్దు చేసి, కుటుబాలను ప్రోత్సహించేలా ప్రయత్నం చేస్తోంది. 
 
అయితే, చైనా పాలకులు తీసుకున్న నిర్ణయం వల్ల అవాంఛిత గర్భాలతో పాటు హెచ్.ఐ.వి వంటి లైంగిక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కండోమ్ కొనలేని వారు పిల్లలను ఎలా పెంచుతారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశ్నిస్తున్నారు. ఈ చర్య కేవలం ప్రచారానికే తప్ప... అసలు సమస్యను పరిష్కరించదని వారు అభిప్రాయపడుతున్నారు.