శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 24 నవంబరు 2024 (22:50 IST)

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

Pushpa 2 The rule
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ మూడవ సింగిల్, 'కిస్సిక్' రిలీజ్ చేసారు. ఆదివారం చెన్నైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో చిత్ర బృందం ఈ పాటను లాంచ్ చేసింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటలో అల్లు అర్జున్, శ్రీ లీల ఉన్నారు. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ ఈ పాటకి ఆకట్టుకునే లైన్స్ రాయగా, శుభలక్ష్మి తన గాత్రాన్ని అందించింది. మేకర్స్ ట్రాక్‌ని విడుదల చేసి, “ఈ రోజు నుండి, మీరు ఎక్కడికి వెళ్లినా, కిస్సిక్!” అని రాశారు.
 
సుకుమార్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్టుతో ప్రతిష్టాత్మక సీక్వెల్, అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న నటించిన పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన లభించింది. పుష్ప అంటే ఫ్లవర్ కాదు... వైల్డ్ ఫైర్ అనే పంచ్ డైలాగ్ ఇప్పటికే తిరుగుతోంది.
 
మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు, సుకుమార్ రైటింగ్స్ సహకారంతో నిర్మించిన ఈ చిత్రం 2019 బ్లాక్‌బస్టర్ పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్. చిత్ర బృందంలో సునీల్, రావు రమేష్, బ్రహ్మాజీ, జగదీష్ ప్రతాప్ తదితరులు నటిస్తున్నారు.