గురువారం, 9 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : మంగళవారం, 7 అక్టోబరు 2025 (18:02 IST)

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Silambarasan TR -Arasan poster
Silambarasan TR -Arasan poster
హీరో సిలంబరసన్ TR, వెట్రిమారన్, లెజెండరీ నిర్మాత కలైపులి ఎస్. ధాను క్రేజీ కాంబినేషన్ లో రూపొందిస్తున్న చిత్రంకు అరసన్ అనే టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ రిలీజ్ తో అభిమానుల్లో సందడి నెలకొంది. ఈ భారీ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన పోస్టర్‌లో సిలంబరసన్ TR పవర్ ఫుల్ గా కనిపించారు.
 
దర్శకుడు వెట్రిమారన్, నిర్మాత కలైపులి ఎస్. ధాను లాంటి క్రేజీ కాంబినేషన్ లో రావడంతో  సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. త్వరలోనే చిత్రంలోని ఇతర నటీనటులు, టెక్నికల్ టీం వివరాలు మేకర్స్ త్వరలో తెలిజేస్తారు.
 
పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకున్న సిలంబరసన్ TR, ఇప్పుడు ‘అరసన్’గా వెండితెరపై అలరించడావ్నికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్ లో మరో మైల్ స్టోన్ మూవీగా నిలవనుంది.